ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న నంద్యా ఉప ఎన్నిక‌లు

Bhuma vs Gangula in Nandyal By Election

నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తుల‌పై వైసీపీ క్లారిటీతో ఉండాగా ...ఇప్ప‌టి వ‌ర‌కు అయేమ‌యంలో ఉన్న టీడీపీ ఇప్పుడిప్పుడే స్ప‌ష్ట్త వ‌స్తోంది.ఇప్ప‌టికే వైసీపీ అభ్య‌ర్తి క‌రారు కావ‌డంతో ఇక ఆల‌స్యం చేయ‌కుండా బాబుకూడా త‌మ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించేదుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లారిటీ ఇచ్చింది. గంగుల ప్రతాప రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే గంగుల ప్రభాకర్ రెడ్డి వైకాపాలో చేరిపోగా, ప్రతాప రెడ్డి కూడా జగన్ తో సమావేశం అయ్యాడు. నంద్యాల పరిధిలోనే సభ ను నిర్వహించి.. ప్రతాపరెడ్డికి వైకాపా కండువా వేసి, అభ్యర్థిగా ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

ప్రతిపక్ష పార్టీ బై పోల్ కు ఈ విధంగా రెడీ అవుతుండగా.. ఇన్నాల్లు అభ్య‌ర్తి ఎవ‌ర‌నేదానిపై తెలుగుదేశం పార్టీలోనూ అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్ర‌కారం.. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానంద రెడ్డి. ఈయనే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
భూమా నాగిరెడ్డి 2014లో వైసీపీనుంచి నంద్యాల‌నియేజ‌క‌ర్గంనుంచి గెలుపొంది త‌ర్వాత‌..టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.అనుకోకుండా హ‌టాత్మ‌ర‌నం చెంద‌డంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసందే.అయితే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి శిల్పా మోహన్ రెడ్డి తగని ఉత్సాహంతో ఉన్నారు. టీడీపీ టికెట్ తనకే దక్కాలని ఇది వరకూ ఆయన డిమాండ్ చేశారు కూడా.

అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో రెండు మూడు సార్లుగా జరిగిన చర్చల నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి చల్లారినట్టుగా తెలుస్తోంది. బాబు ఎవరు చెబితే వాళ్లే నంద్యాల నుంచి పోటీ చేస్తారని శిల్పా చక్రపాణి రెడ్డి ఇటీవల ప్రకటించారు.
చంద్ర‌బాబు భూమా కుంటుంబంవైపే మొగ్గు చూప‌డంతో నంద్యాల రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.గ‌తంలో మాదిర‌గానే ఈసారికూడా భూమా ....గంగుల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర‌పోటీ నెల‌కొంది.మ‌రి ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రు సాధిస్తారో చూడాలి మ‌రి.

Also Read


Facebook

Videos