నిషిత్‌ యాక్సిడెంట్‌ తరహాలో మారో యాక్సిడెండ్‌ అదే రోడ్ లో

other accident on hydrabad like ap minister narayana son nishith

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్  నెం.36లో వారం రోజుల క్రితం జరిగిన కారు యాక్సిడెంట్ లో  ఏపీ మంత్రి నారాయణ కూమరుడు నిషిత్ అక్కడిక్కడే ప్రాణాలు కోలిపోయన విషయం తెల్సిందే. 200 కిమీ స్పీడ్ తో వెళ్లిన బెంజ్ కారు మెట్రో రైల్ పిల్లర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే రోడ్డులో ప్రమాదం జరిగింది. అయితే ఈసారి ప్రమాదం మెట్రో పిల్లర్  గుద్దుకోవడం వల్ల కాదు.. రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వల్ల జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. స్థానికులు, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నేడు ఉదయం ఒక విదేశీ స్పోర్ట్ కారు మరియు మినీ బీఎండబ్ల్యూ మినీ కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమయంలో కార్లు నిర్ధిష్ట స్పీడ్ లోనే ప్రయాణిస్తున్నాయి.

దాంతో రెండు కారుల్లో ఉన్న సెఫ్టీ ఎయిర్ బెలున్స్ ఓపెన్ అయ్యాయి. దాంతో రెండు కార్లలో కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. నిషిత్ కూడా కాస్త స్లోగా తన కారును నడిపి ఉంటే ఎయిర్ బెలున్స్ ఓపెన్ అయ్యి ప్రాణాలు కాపాడుకునేవాడు అంటున్నారు. ఆ రోడ్డుపై ప్రతి రోజు ఎక్కడో ఒక చిన్న లేదా పెద్ద యాక్సిడెంట్ లు కామన్ అంటూ స్థానికులు చెబుతున్నారు. అతి వేగంగా ప్రయాణించే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. 

Related

  1. నిషిత్‌ చనిపోవడానికి కారణాలు.. ‘బెంజ్‌’ కంపెనీకి రిపోర్ట్‌లో..
  2. చాలా సేఫ్టీ కారు అయినప్పటికి నిషిత్‌ ఎందుకు చనిపోయాడో తెలుసా ?
  3. నిషిత్‌ యాక్సిడేంట్ కు కారణం అయిన కారును మంత్రి నారాయణ ఏం చేశారో తెలుసా..?
  4. షాకింగ్ : బన్నీ కారుకు యాక్సిడెంట్.. అసలు ఏం జరిగింది..?

Facebook

Videos