శ్రీకాకులం జిల్లాలో టీడీపీ కి భారీషాక్‌..

Vasireddy Varada Rama Rao and other Leaders Joins in YSRCP from Srikakulam

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడికి వ‌ల‌స‌ల భ‌యం ప‌ట్టుకుంది.ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టికే వ‌ల‌స‌లు నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్నాయి. తాజాగా బాబుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ దిమ్మ‌తిరిగే శాక్ ఇచ్చారు.

ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు వైసిపి, కాంగ్రెస్ నేతలను టిడిపి ఆకర్షిస్తోంది. అయితే, జగన్ టిడిపి అసంతృప్త నేతలపై దృష్టి సారించారు.జ‌గ‌న్‌కూడా చంద్ర‌బాబు పార్ములానే పాలోఅవుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు వైసిపిలో చేరారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నుంచి మరో కీలక నేత జగన్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వాసిరెడ్డి వరద రామారావు ఈ రోజు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీ కండువాను క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు జ‌గ‌న్.మరికొంత మంది స్థానిక నేతలు కూడా కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.బ‌ల‌మైన సామాజికి వ‌ర్గం అండ‌దండ‌ల‌తో జిల్లాలో వాసిరెడ్డి త‌న హ‌వా కొన‌సాగిస్తున్నారు.
వాసిరెడ్డి తెర్లాంనుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా... ఒక సారి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు.1978 లో ఎమ్మేల్యేగాఎన్నిక‌యిన ఆయ‌న ...ఎన్‌టీరామారావుతోపాటు టీడీపీలో సుదీర్‌ఘ‌కాలం కొన‌సాగారు.అయితే టీడీపీలో త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌డంతోనే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుగురించి ఆలోచించే ఈనిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.మంత్రి వ‌ర్గ విస్త‌ర‌న‌తో శ్రీకాకులంజిల్లాలో టీడీపీలో ఏర్ప‌డిన అసంతృప్తి వైసీకీ క‌ల‌సి వ‌స్తోంది.

వాసిరెడ్డి వైసీపీలోకి రావ‌డానికి సీనియ‌ర్‌నేత బొత్స‌స‌త్య‌నారాయ‌న కృషి ప‌లించిన‌ట్లుంది.పార్టీ ప‌టిస్టానికి బొత్స తీవ్రంగా కృషిచేస్తున్నారు.దీనిలో భాగంగా వాసిరెడ్డితో స‌హా ఐదు వేల మంది వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.బాబు వ‌ల‌స‌లు ఎంత‌వ‌ర‌కు ఆపుతార‌న్న‌ది పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

Also Read

 


Facebook

Videos