ఇక నుంచి మిమ్మ‌ల్ని రోబోలే ఇంట‌ర్వూ చేస్తాయి..

Your next job interview could be with a recruiter bot

మారుతున్న టెక్నాల‌జీకి అనుగునంగా సంస్థ‌లు ఉద్యోగుల స్తానంలో రోబోల‌ను తీసుకుంటున్నారు.పనిచేసే రోబోలు మానవుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని గోల చేస్తున్నవారు నేడు ఎందరో ఉన్నారు. దీని వ‌ల్ల భ‌విష్య‌త్తులో కృత్తిమ రోబోలు పెరిగిపోతే నిరుద్యోగ స‌మ‌స్య‌పెరుగుతుంద‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న నెల‌కొంది.

కాని ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా మానవులకు ఉద్యోగాలిస్తున్న రోబోలు నేడు మార్కెట్‌లోకి వచ్చాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ‘మ్యా సిస్టమ్స్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగాల కోసం వచ్చే వారిని ఇంటర్వ్యూ చేసేందుకే ప్రత్యేకమైన రోబోలను తయారు చేసింది. ఆ రోబోలకు బాట్‌ అని నామకరణం కూడా చేసింది.

ప్ర‌పంచంలో వేగంగా మారుతున్న మార్పుల‌కు అనుగునంగా ఉన్న కంపెనీల‌తోపాటు ..కొత్త కంపెనీలు వ‌స్తుంటాయి.ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల‌కోసం ద‌ర‌కాస్తులు చేసుకుంటారు.వారంద‌రిని ఇంట‌ర్యూచేయాలంటె ఎంతో శ్రుమ‌తో కూడుకున్న‌పిని. ఉద్యోగుల అప్లికేష‌న్స్‌ల‌ను త్వ‌ర‌గా ప‌రిశీలించేందుకే బాట్ రోబోల‌ను కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ద‌ర‌ఖాస్తుల ఫారాల‌ను ప‌రిశీలించే ప్రాథ‌మిక స్థాయినుంచి స‌ద‌రు సంస్థ‌లేదా బ్రాంచ్ మేనేజ‌ర్ ఇంట‌ర్వూ చేసే ప‌నుల‌న్నీ రోబోలు చేస్తాయి.

ఉద్యోగాలు రాక‌పోయిన వారికి వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి వాల్లు ఏరంగంలో రానిస్తారో...ఏ ఉద్యోగానికి ప‌నికి వ‌స్తారో రోబోలే సూచిస్తాయి.అమెరికాలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్లు కలిగిన ఐదు పెద్ద కంపెనీల్లో మూడు కంపెనీలు ఇప్పటికే తమ బాట్‌ రోబో సేవలను ఉపయోగించుకుంటున్నాయని ‘మ్యా సిస్టమ్స్‌’ వ్యవస్థాపకులు ఎయాల్‌ గ్రేఎవెస్కీ తెలిపారు.
గ‌త జూలైలోనే గతేడాది జూలై నెలలోనే తాము ఈ రోబోల విక్రయాన్ని ప్రారంభించామని, ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులను ఎంపిక చేసే సామర్థ్యం కలిగిన బాట్‌లను ఉత్పత్తిచేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన వివరించారు.

Also Read

 


Facebook

Videos