మీ ఏటిఎం కార్డులను యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు!

you can switch on and off your atm card

పెద్ద నోట్లు రద్దు చేయడంతో కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెట్టింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపడుతోంది. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ముందుకెల్తోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి.

అదే టైంలో ఖాతాదారుల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మీ బ్యాంక్ కార్డ్ సురక్షితంగా అయ్యే విధంగా దానికి ON / OFF సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. మీ ATM కార్డ్ ను స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI క్విక్ అనే యాప్ నుంచి నియంత్రించొచ్చు. ఈ యాప్ తో మీ ATM కార్డ్ ను కనెక్ట్ చేసుకుని.. స్విచ్ఆన్.. ఆఫ్ చేసుకోవచ్చు.

మీరు ATM సెంటర్ కు వెళ్లినప్పుడు ఆన్ చేసుకుంటే.. కార్డ్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కార్డ్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీ ATM కార్డ్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయటానికి వీలుకాదు. ఒక్క ATM సెంటర్ నుంచి కాదు.. ఎక్కడైనా సరే కార్డ్ ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడే మాత్రమే ఆన్ చేసుకుంటే సేఫ్ గా ఉంటుందని SBI అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని క్రయ, విక్రయాలు కార్డ్ ద్వారానే జరుగనున్నాయి. ఈ క్రమంలోనే కార్డ్ కు మరింత భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

Related

  1. పాత నోట్లను RBI ఏం చేస్తుందో తెలుస్తే షాక్ అవుతారు!
  2. ఏటీఎం వద్దకు వెళ్లకుండా.. డబ్బు తెచ్చుకుంటున్నారు!
  3. ఫ్రీ కదా అని వాడేశారా... అయితే బిల్లు క‌ట్టాల్సిందే
  4. 2000 నోటులో కేంద్ర ప్రభుత్వం చిక్కులో పడింది!

Facebook

Videos