షాకింగ్.. ఇప్పటి వరకు అంతుచిక్కని ఇండియన్ మిస్టరీస్ !!

indian militarys

మన చుట్టుపక్కల ఎన్నో వింతలు, ఆశ్చర్యం కలిగించే సన్నివేశాలు జరుగుతున్నాయని  వినే ఉంటాం.. అందులో కొన్నింటిని కొంతమంది చూసే ఉంటారు. అటువంటి ఎన్నో వింతల వెనుక ఉన్న రహస్యాలను మన శాస్త్రవేత్తలు చేధించారు. అయితే ఇప్పటికీ చేధించని వింతలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి కొన్ని మిస్టరీల గురించి తెలుసుకుందాం. మొదటిది మాస్ బర్డ్ సూసైడ్.. అసాంలోని జటింగాలో సెప్టెంబర్ నెలలో  రాత్రిపూట వేల సంఖ్యలో పక్షులు ఒక చెట్టును ఢీకొని సూసైడ్ చేసుకుంటాయి.

ఎన్నో వేల సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ సూసైడ్ పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నా అది ఇంకా మిస్టరీగానే మిగిలింది. రెండవది అలేయా గోస్ట్ లైట్స్. పశ్చిమ బెంగాలో రాత్రి పూట కళ్లు మిరిమిట్లు గొలిపేటట్లు కనిపిస్తాయి ఈ గోస్ట్ లైట్స్. అవి ఎందుకు అలా ప్రకాశిస్తాయో ఇప్పటికీ అంతుబట్టలేదు. అయితే స్ధానికులు మాత్రం ఆ కాంతులు అక్కడ ప్రమాదవశాత్తు చనిపోయిన వారి ఆత్మలకు సంబంధించినవని,  ఎవరైనా వాటిని  వెంబడిస్తే వారు కూడా చనిపోతారని లేదా పిచ్చివారు అవుతారని అంటున్నారు. ఇక మూడవది  స్కెల్టెన్స్ లేక్.. ఉత్తరాఖండ్ లోని చమోలీలోని సరస్సులో వేల కొలది స్కెల్టెన్స్ కనిపిస్తుంటాయి. అయితే అంతమంది చనిపోవడానికి దారి తీసిన పరిస్థితులు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

ఇక నాల్గవది లేపాక్షలోని హ్యాంగింగ్ పిల్లర్. అంత బరువుగల పిల్లర్ ఇన్నిసంవత్సరాల నుండి అలా వ్రేలాడుతుందో ఇప్పటికీ తెలియలేదు. ఐదవది కుల్ ధారా విలేజ్. రాజస్థాన్ లో ఉన్న విలేజ్ దాదాపు శిధిలమైపోయింది. కొన్ని సంవత్సారల క్రితం అక్కడి రాజుగారి దగ్గర ఉండే దివాన్ ఆ ఊరికి చెందిన  పెద్దమనిషి  కూతుర్ని వివాహం చేసుకుంటానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అది నచ్చని ఆ ఊరి ప్రజలందరూ రాత్రి రాత్రే ఊరు వదిలి వెళ్లిపోయారు. వారు ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ తెలియదు. తర్వాత ఆ ఊరిని ఆక్రమించుకుని  జీవిద్దామనుకున్న చాలామంది అతిభయకరంగా చనిపోయారు. ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుందామని వెళ్లిన శాస్త్రవేత్తలకి వింత అనుభవాలు ఎదురవ్వడంతో అది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఆరవది ట్విన్ విలేజ్. కేరళలో ఉన్న కోధిని విలేజ్ లో అందరికీ కవల పిల్లలే పుడుతుంటారు. పెళ్లి చేసుకుని ఆ ఊరినుండి వేరే ఊరు వెళ్లినవారికి కూడా కవలలే పుట్టడం విశేషం. ఇక ఏడవది లడక్ లోని మ్యాగ్నెటిక్ హిల్. కొంచెం ఏటవాలు కనిపించే ఈ పర్వతం కేవలం కంటికి మాత్రమే అలా పర్వతంలా కనిపిస్తుంటుంది. అది ఎందుకు అలా ఎత్తుగా కన్పిస్తుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అలాగే కేరళలోని ఇరుక్క్ జిల్లాలో రెడ్ రెయిన్. అక్కడ వాన ఎందుకు ఎర్రగా కురుస్తుందో శాస్త్రవేత్తలకు సైతం అంతుబట్టలేదు. ఇటువంటి అంతుబట్టని వింతలు మన ఇండియాలో ఇంకా చాలానే ఉన్నాయి. 


Facebook

Videos