ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే సిరిసంపదలు మీ వెంటే!!

these plants bring luck wealth prosperity and health to home

పూర్వకాలంలో పెరడు చాలా ఎక్కువగా ఉండడం వల్ల రకరకాల మొక్కలను పెంచేవారు మన పెద్దలు.  అయితే ప్రస్తుతం అంతా కాంక్రీట్ జంగల్ అవడంతో అసలు మొక్కలను పెంచడం మానేశారు ఇప్పటి జనరేషన్ వాళ్లు. ఫలితంగా ఆరోగ్యం, ఐశ్వర్యం రెండు దూరమవుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం  చిన్న చిన్న కుండీల్లో  చిన్న చిన్న మొక్కలన్ని పెంచుతూ ఆనందపడుతున్నారు. ఆ మొక్కల నుండి వచ్చే గాలి పీలిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే మొక్కలు ఇంట్లో పెంచితే సిరిసంపదలు మీ వెంటే ఉంటాయంటన్నారు పండితులు. వాటిల్లో మొదటిది మనీప్లాంట్… ఈ మొక్క పేరులోనే డబ్బు ఉంది, ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే ధనం పుష్కలంగా సమకూరుతుంది అని నమ్మకం. డబ్బే కాకుండా ఈ మొక్క కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల తెలియకుండానే, మనకు చాలా లాభం చేకూరుతుంది. అయితే రోజూ ఈ మొక్కకి కొద్దిగా నీళ్లు పోయాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇక రెండవది.. తమలపాకుల చెట్టు. ఈ చెట్టును కుండీల్లో కూడా  పెంచుకోవచ్చు. ఈ చెట్టును తీగలాగా  దేనికైనా పాకించాలి. అప్పుడు ఇంట్లో కూడా సిరిసందలు పొంగిపొర్లుతుంటాయి. ఇక మూడవది… కలబంద. దిష్టి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉండి తీరాల్సిందే.  మనలో చాలా మంది ఇళ్లలో గుమ్మానికి కలబంద మొక్క వేలాది దీసి ఉండటం గమనిస్తూనే ఉంటాం, ఈ మొక్క వల్ల దిష్టి దోషాలన్నీ పోతాయి. లక్ష్మీ దేవి ప్రతిరూపంగా భావించే తులసి మొక్క ఇంట్లో  ఉంటే అదృష్టం, ఆరోగ్యం రెండూ ప్రాప్తిస్తాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావిస్తారు. అందుకే ఉసిరి మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇల్లు  శుభదాయకంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఉసిరి, తులసిని కలిపి పూజ చేయడం ద్వారా సిరిసంపదలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. 


Facebook

Videos