కలలో ఇవి కన్పిస్తే .. త్వరలోనే డబ్బులు వస్తాయని అర్ధమట!!

seeing these your dreams will get you money

ప్రతి ఒక్కరికి కలలు రావడం సహజం. వాటిలో కొన్ని కలలు మంచివిగా మరి కొన్ని చెడ్డవిగా వస్తుంటాయి. కొంతమంది వీటిని  కేవలం భ్రమలుగా కొట్టిపారేస్తుంటారు. అయితే తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. అందులోనూ తెల్లవారు జామున వచ్చే కలల్లో కొన్ని వస్తువులు కన్పించాయంటే త్వరలోనే డబ్బులు చేతికి అందుతాయని పండితులు కూడా చెబుతున్నారు.

మరి మిమ్మలన్ని ధనవంతుల్ని చేసే ఆ కలల గురించి టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం. కలలో ఉదయిస్తున్న సూర్యుడు గానీ, పున్నమి చంద్రుడు  కానీ కనిపిస్తే త్వరలోనే డబ్బులు చేతికి అందుతాయని అర్దం. అలాగే తెల్లవారు జామున వచ్చే కలలో మనుషుల మలం అంటే లెట్రిన్ కన్పిస్తే వెంటనే అంటే అదే  రోజు గానీ మరుసటి రోజు గానీ డబ్బులు ఖచ్చితంగా చేతికి అందుతాయని పండితులు చెబుతున్నారు. జుట్టు రాలుతున్నట్టు,   ఆవు పాలు ఇస్తున్నట్టు, బంగారం ధరించినట్టు, పాయసం తింటున్నట్లుగా కానీ వండుతున్నట్లుగా కానీ, చక్కటి అద్దాలు  కలలో కనిపిస్తే వారికి   త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. 


Facebook

Videos