జియోని పక్కనపడేసేలా ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్.. !

airtel provide bumper offer for users

గత కొంత కాలంగా టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తోంది రిలయన్స్ జియో. అయితే జియో ఇస్తున్న ఆఫర్స్ ముందు.. ఇతర కంపెనీలు అందుకు తగ్గ ఆఫర్స్ ఇవ్వకపోవడంతో జియో టెలికాం రంగంలో రికార్డు సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు జియో కి షాక్ ఇవ్వడానికి ఇతర కంపెనీలు కూడా ముందడుగు వెస్తున్నాయి.

అందులో భాగంగానే ఎయిర్ టెల్ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా గా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు కూ పోనివ్వకుండా ఎయిర్ టెల్ జరా జాగ్రత్త పడుతుంది. ఇప్పటివరకు ఉన్న డేటా ప్యాకేజీలను 100 శాతం రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఆఫర్స్..  రూ.899 ప్లాన్ కింద ఇచ్చే 30 జీబీ హైస్పీడ్ డేటాను 60 జీబీకి పెంచింది.

రూ.1099 ప్లాన్ కింద అందించే 50 జీబీ డేటాకు బదులు ఇప్పుడు 90 జీబీ డేటాను ఇవ్వనుంది. రూ.1299 ప్లాన్‌తో 125 జీబీ ఆఫర్ చేస్తోంది. గతంలో ఇది 75 జీబీగానే ఉండేది. ఇక ప్రిమీయం ప్లాన్ కింద రూ.1499తో అందించే 100జీబీ డేటాను 160 జీబీకి పెంచింది. గృహ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించేలా ‘వి-ఫైబర్’ సూపర్‌ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌ను లాంచ్ చేసినట్టు భారతీ ఎయిర్‌టెల్ సీఈవో (హోమ్స్) హేమంత్ కుమార్ గురుస్వామి తెలిపారు. ఎయిర్ టెల్ ఇస్తున్న ఈ ఆఫర్స్ తో జియో పని అయిపోయినట్లే అని అంటున్నారు. 

Related

  1. జియో కొత్త పథకం.. 100 శాతం క్యాష్ బ్యాక్
  2. జియో మరో సూపర్ ఆఫర్.. ఇంకో సంవత్సరం పాటు పండగ
  3. జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది
  4. జియోకు తేరుకోలేని షాక్.. కేవలం రూ.103 కే అన్ని ఆఫర్లు..

Facebook

Videos