ఆమె రూపొందించిన డ్ర‌స్సుకు ఒ ప్ర‌త్యేక‌త ఉంది...

Dress made by Chocolate covers

పురుస‌లందు పుణ్య‌పురుసులు వేర‌య్యాని వేమ‌న ప‌ద్యంలో చ‌దువుకున్నా. కాని ఇప్పుడు డ్ర‌స్సు లందు ఆమె వేసుకున్న డ్ర‌స్సు వేర‌యా మీరు వింటున్న‌ది నిజ‌మే. అదందూ బంగారం,వెండి పూత‌ల‌తో ధ‌రించిన డ్ర‌స్సుల‌నే చూశాం కాని ఆమెధ‌రించిన డ్ర‌స్సు ఏదాంతో త‌యార‌య్యిందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే.  దానికో ప్ర‌త్యేక‌త ఉంది.

పెన్సిల్వేనియాలోని ఎలిజబెత్‌ టౌన్‌కి చెందిన ఎమిలీ సెయిల్‌హమెర్‌కి పనికిరాని వస్తువులతోక్రియేటివ్ గా ఏదైనా ప్రయత్నించడం చాలా ఇష్టం . దీంతో తమ ఇంట్లో చాలా వస్తువులను తయారుచేసింది. అయితే తన భర్తకు స్టార్‌బర్‌స్ట్‌ క్యాండీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఐదేళ్ల క్రితం తొలిసారి వీళ్లిద్దరూ కలుసుకున్నపుడు కూడా ఎమిలీకి అవే క్యాండీ చాక్లెట్‌ కానుకగా ఇచ్చాడట. ఆ క్యాండీ చాక్లెట్‌ కవర్‌ని చూసిన ఎమిలీ వాటితో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేస్తే బావుంటుందని అనుకుంది. అనుకున్న‌దే త‌డువుగా చాక్లెట్‌ కవర్లను సేకరించి ఓ డ్రెస్సు తయారుచేయాలని భావించింది.

డ్ర‌స్‌ని రూపొందించ‌డంకోసం ఎవరు స్టార్‌బర్‌స్ట్‌ క్యాండీ చాక్లెట్లు తిన్నా.. వాటి కవర్లను పడేయకుండా తనకు ఇవ్వమని భర్త.. స్నేహితులు.. బంధువులకు సూచించిందట ఎమిలీ. అలా దాదాపు ఐదేళ్లపాటు కష్టపడి 10వేల చాక్లెట్‌ కవర్లను సేకరించిందట. ఈ ఐదేళ్లలో వివిధ రంగులకు చెందిన కవర్లను ఒకదానికొకటి అల్లుతూ వాటన్నింటిని ఓ చైన్‌లా తయారుచేసింది. తర్వాత వాటిని ఎలాస్టిక్‌ దారంతో ఓ డ్రెస్సులా కుట్టింది.ఇప్పుడు ఈమె ధ‌రించిన డ్ర‌స్ వైర‌ల్‌గా మారి అంద‌ర్నీ ఆక‌ర్శిస్తోంది.అదండి ఆ డ్ర‌స్ ప్ర‌త్యేక‌త‌.


Facebook

Videos