భార్యని ఆడుకుంటున్న సెహ్వాగ్

Virender Sehwag Hits Six After Six On Twitterక్రికెటర్ గా ఉన్నప్పుడు మైదానంలో బ్యాట్ తో చెలరేగిపోయిన వీరేంద్రుడు ఇప్పుడేమో ట్వీట్లతో చెలరేగిపోతున్నాడు. రకరకాల విషయాలపై తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ సోషల్ నెట్ వర్క్స్ లో బిజీగా ఉంటున్నాడు. ఒలింపిక్స్ లో భారత ప్రదర్శనపై పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేసిన బ్రిటీష్ జర్నలిస్టు మోర్గాన్ పై సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్ కు అనంతరం అది రజత పతకంగా మారడంపై కూడా "చాలా బాగుంది. అమెరికాలో క్రికెట్ అప్ గ్రేడ్ అయినట్లు - భారత బౌలర్ నెహ్రా స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ అయినట్లు" అని ట్వీట్ చేశాడు. ఇలా తనదైన శైలిలో అటు చురకలు ఇటు చమత్కారాలతో ట్విట్టర్ లో సెహ్వాగ్ చెలరేగిపోతున్నాడు. అయితే తాజాగా తన భార్యపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ట్వీట్ విసిరేశాడు.

"భార్యతో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్ లోనే ఉండాలి. ఆమె మాట్లాడేది ఏమాత్రం నచ్చకపోయినా కావాల్సినప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్లిపోవచ్చు" అని ఆమెతో కాస్త దూరంగా ఉంటేనే బెటరన్న భావనతో చమత్కారంగా ట్వీట్ చేశాడు. కాగా ఢిల్లీకి చెందిన ఆర్తితో 2004లో సెహ్వాగ్ కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. 2015లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్ అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నాడు.


Facebook

Videos