500 వ టెస్ట్ ప్రారంభం

former india captains felicitated to mark countrys historic 500th test

భారత పరిమిత ఓవర్ ల క్రికెట్ కెప్టెన్ పలువురు మాజీ కెప్టెన్ లతో కలసి సన్మానాన్ని అందుకున్నాడు.నేడు భారత క్రికెట్ లో అపురూపమైన రోజు. టెస్ట్ క్రికెట్ లో భారత్ 500 వ టెస్ట్ ను ఆడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియోషన్ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా భారత్ సేవలందించిన మాజీ కెప్టెన్ లను సన్మానించాడు.

ఈ కార్యక్రమానికి ధోని కూడా హాజరయ్యాడు. ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.టెస్ట్ క్రికెట్ లో ధోని కూడా మాజీనే. ధోని తోపాటు ఈ కార్యక్రమానికి సచిన్, గంగూలీ, శ్రీకాంత్, కపిల్ దేవ్, వేంగాస్కర్, సునీల్ గవాస్కర్ లు హాజరయ్యారు.

1932 లో భారత్ లార్డ్స్ మైదానం లో తొలి టెస్ట్ మ్యాచ్ ను ఆడింది. ఇప్పటివరకు 32 ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు.ఇప్పటి వరకు ఇంగ్లాండ్ అత్యధికంగా 976 టెస్టులు ఆడింది.ఆస్ట్రేలియా 791 టెస్టులతో రెండో స్థానం లో ఉండగా ఆతరువాత వెస్టిండీస్ 517 టెస్టులతో , ప్రస్తుతం భారత్ 500 టెస్టులతో ఉన్నాయి.


Facebook

Videos