ఈ దెబ్బతో భారత్ నెంబర్ 1

india to be number one in icc test rankings with win at eden gardens

చరిత్రాత్మక 500వ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ఈడెన్‌లో 250 హోం టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధి స్తే… అభిమానుల్లో తొలి టెస్టు విజయంతో దక్కిన ఆనందం పది రెట్లు కానుం ది. దానికున్న ఏకైన ప్రాధాన్యత ఎంటంటే… ఈడెన్‌లో టీమిండియా విజయం సాధిస్తే ప్రస్తుతం పాకిస్తాన్ చేతిలో ఉన్న ప్రపంచ నంబర్-1 టెస్టు జట్టు ర్యాంక్ భారత్ ఖాతాల్లో రానుంది.

ఇంకా చెప్పాలంటే.. దాయది దేశం పాకిస్థాన్ నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ గదను రాజసంతో రాబట్టుకునే అవకాశం ఉంది. టీమిం డియా కన్నా ఒకే పాయింట్ ఎక్కువ ఉండటంతో ఆ జట్టు నెం.1 అయిన సంగ తి తెలిసిందే.

పర్యటక జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచందన్ర్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 200 వికెట్లు మైలురాయిని చేరుకున్నాడు. దీంతో టెస్టు బౌల ర్ల జాబితాలో రెండో స్థానం సంపాదించాడు. ఆల్‌రౌండర్ల జాబితలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.


Facebook

Videos