టీం ఇండియా కెప్టెన్ ధోనీ కి తిరుగు లేదు

ms dhoni the untold story box office blockbuster opening day

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ బాక‍్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. తొలిరోజు 21.30 (గ్రాస్) కోట్ల రూపాయలు వచ్చినట్టు టాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఈ ఏడాది తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో సుల్తాన్ (36.54 కోట్లు) తర్వాత ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉంది. ఇక బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఎంఎస్ ధోనీ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడం, ప్రేక్షకుల్లో మంచి టాక్ రావడంతో తొలిరోజు మాదిరే శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లు రావచ్చని భావిస్తున్నారు.

నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ధోనీ పాల్గొనడంతో అభిమానుల్లో అమితాసక్తి ఏర్పడింది.


Facebook

Videos