సెహ్వాగ్ కి పంచ్ వేసిన అతని భార్య

sehwag wife aarti ahlawat tweet on ravichandran ashwin

ఇటీవలి కాలంలో తనదైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్న మాజీ డ్యాషింగ్ క్రికెటర్ సెహ్వాగ్ మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

ఇటీవల ముగిసిన పేటీఎం మూడు టెస్టుల సిరీస్ లో భారత విజయానికి తనవంతు కృషి చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ లను గెలుచుకున్న రవిచంద్రన్ అశ్విన్ కు అభినందనలు తెలుపుతూ సెహ్వాగ్ పెట్టిన ట్వీట్ కు అశ్విన్ భార్య ప్రీతి, సెహ్వాగ్ భార్య ఆర్తిలు స్పందించడంతో మొత్తం ఫన్నీ ట్వీట్ సంభాషణ నెటిజన్లను అలరిస్తోంది. "అద్భుతంగా ఆడి ఏడో విడత మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న అశ్విన్ కు అభినందనలు.

ఇంటికి వెళ్లాల్సిన తొందరేమిటో పెళ్లయిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది" అని సెహ్వాగ్ చమత్కార ట్వీట్ వదలగా, అశ్విన్ అందుకు థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఇదే ట్వీట్ పై అశ్విన్ భార్య ప్రీతి ఓ నవ్వు నవ్వి స్పందిస్తూ, "నేనేం చేయనండీ మరి" అని మురిపెంగా బదులివ్వగా, ఈ సంభాషణలోకి సెహ్వాగ్ భార్య ప్రీతి భాగం పంచుకుంటూ, "వాళ్లిద్దరికీ (అశ్విన్, సెహ్వాగ్) ఎప్పుడూ తొందరెక్కువ" అని కామెంట్ పెట్టింది.


Facebook

Videos