ఐసీసీ ఛాంఫియ‌న్స్ ట్రోపి జ‌ట్టు ఇదే.

BCCI announces ICC Champions Trophy 2017 india cricket team

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రో పై భార‌త జ‌ట్టు ఆడే విష‌యంపై నెల‌కొన్న స్తంభ‌న తొల‌గింది. ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది.ఐపీఎల్‌లో రాణించిన ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌కు సెల‌క్ట‌ర్లు అవ‌కాశం క‌ల్పించారు.

పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మి కూడా తిరిగొచ్చాడు. చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొన‌డానికి ఆదివార‌మే బీసీసీఐ క్లియ‌రెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.
మొద‌టి నుంచి ఐసీసీతో నెల‌కొన్న ఆదాయ పంపిణీ వివాదంతో మొదట టోర్నీకి దూరంగా ఉండాల‌ని భావించినా.. ఆదివారం జ‌రిగిన ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో చాంపియ‌న్స్ ట్రోఫీలో పాల్గొనాల‌ని నిర్ణయించింది బీసీసీఐ.సుప్రీంకోర్టు నియ‌మించిన సీఓఏ పాల‌క క‌మిటీ జోక్యం చేసుకొవ‌డంతో బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.
టోర్నీలో కి భార‌త్ డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. 2013లో చివ‌రిసారి జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై గెలిచి ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఇక వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌, సురేశ్ రైనా, కుల్దీప్ యాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, శార్దూల్ ఠాకూర్‌ల‌ను స్టాండ్‌బైలో ఉంచిన‌ట్లు సెల‌క్ట‌ర్లు చెప్పారు.
టీమిండియాలో విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావర్‌, రోహిత్‌ శర్మ, రహానె, ధోనీ, యువరాజ్‌సింగ్‌, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, జడేజా, షమీ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మనీశ్‌, బుమ్రా.ఛాంపియన్స్‌ ట్రోఫీ జూన్‌ 1 నుంచి 18 వరకు ఇంగ్లండ్‌ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ జూన్‌ 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది.

Also Read


Facebook

Videos