ముంబై ఇండియన్స్ vs పుణె రైజింగ్

IPL 10 final who plays whom

ఐపీఎల్-10లో మరో అంకానికి ఆరంభం. లీగ్‌దశను విజయవంతంగా ముగించి ప్లేఆఫ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు నాలుగు జట్లు సిద్ధం. తొలి క్వాలిఫయర్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, పటిష్టమైన పుణె రైజింగ్ సూపర్ జెయింట్ జట్ల మధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంది.

ఒకరిదేమో ఆధిపత్యం.. మరొకరిదేమో ప్రతీకారం.. ఇదీ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనున్న రెండు జట్ల పరిస్థితి. మూడోసారి టైటిల్‌ గెలవాలని ముంబయి ఆశిస్తుండగా... తొలిసారి ప్లేఆఫ్‌కి చేరిన పుణె టైటిల్‌ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ముంబయిపై ఈ సీజన్‌లో రెండు సార్లు గెలిచిన ఏకైక జట్టు పుణె కావడంతో ఈ రోజు జరిగే పోరు ఆసక్తికరంగా సాగనుంది. ముంబయిపై తమ విజయపరంపరను కొనసాగించాలని పుణె భావిస్తుండగా... ప్రతీకారం తీర్చుకోవాలని ముంబయి ఎదురుచూస్తోంది.ఈ కీలక పోరులో ముంబయి జట్టే కాస్త బలంగా కనిపిస్తోంది. లెండిల్‌ సిమన్స్‌, కీరన్‌ పోలార్డ్‌, పార్థివ్‌ పటేల్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లతో ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది.

ఇక పూణె విష‌యానికొస్తేఆరంభంలో సాదాసీదాగా కనిపించిన పుణె సూపర్‌జెయింట్స్ కీలకసమయంలో వరుస విజయాలతో లీగ్‌దశలో రెండోస్థానంతో ప్లేఆఫ్ చేరింది. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, స్టార్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ప్లేఆఫ్ బరిలోకి దిగుతున్న పుణెకు యువ ఆటగాళ్లే బలం. అనూహ్యంగా రాణిస్తున్న యువ సంచలనం రాహుల్ త్రిపాఠి 12 మ్యాచ్ ల్లో 388 పరుగులు చేశాడు.ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పుణె ప్లేఆఫ్స్‌కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే. పుణె పేసర్లు ఉనద్కత్‌, శార్దుల్‌, క్రిస్టియన్‌, ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి, ధోనీ, స్మిత్‌, రహానె రాణిస్తే పుణె గెలుపు సులభం కానుంది.
లీగ్‌దశను విజయవంతంగా ముగించి ప్లేఆఫ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు నాలుగు జట్లు సిద్ధం. తొలి క్వాలిఫయర్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో గెలిచి ఎవ‌రు ఫైన‌ల్‌కు వెల్తారో ఈరోజు తేలిపోనుంది.


Facebook

Videos