ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భార‌త జ‌ట్టుకు స‌చిన సందేశం

Sachin Tendulkar's vital message for Indian cricket team in icc champions trophy

త్వ‌ర‌లో ఇంగ్లాండ్‌లో జ‌రిగే ప్ర‌తీస్టాత్మ‌క‌మైన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భార‌త జ‌ట్టులో స‌చిన్ సందేశం పంపాడు. జూన్ 1 నుంచి ఆరంభంకానున్న ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొనబోతోంది.

ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో భారత్ ఒక్కసారి కూడా పాకిస్థాన్ చేతిలో ఓడలేదు. కానీ.. మినీ ప్రపంచకప్‌గా అందరూ పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం రెండు సార్లు ఓటమి చవిచూసింది.
మొద‌టి సారి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 2004లో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్‌పై పాక్ గెలిచింది. జూన్ 4న ఈ వేదికపైనే భారత్- పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి.మనకు చాలా బలమైన జట్టు ఉంది. నైపుణ్యమున్న క్రికెటర్లతో ప్రస్తుతం సమతూకంగా కనిపిస్తోంది.

విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ జట్టు భారతీయుల కలల్ని నిజం చేస్తుంది. టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నాన‌ని సందేశం పంపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఎక్కువ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఇలాంటివి జట్టుకి అవసరం కూడా. ఎందుకంటే అవే క్రికెటర్లలో ప్రేరణ నింపుతాయి. మీరు ప్రతిభావంతులు కాబట్టే మీపై దేశం అంచనాలను పెంచుకుంటోంది’ అని సచిన్ వివరించాడు.

Also Read


Facebook

Videos