నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో దుమ్ము రేపిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు

Indian womens cricket team highest world records odi score

ద‌క్షిణాప్రికాలో జ‌రుగుతున్న నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో భారత అమ్మాయిలు గత రికార్డుల్ని బద్దలు కొట్టారు. క్వాండ్రాంగుల‌ర్ సిరీష్‌ల‌సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 358 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఈటోర్నీలో తొలి వికెట్‌కు 320 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్ర‌పంచ రికార్డును త‌మ ఖాతాలో వేసుకున్నారు.
క్వాండ్రాంగుల‌ర్ సిరీస్‌లో భాగంలో సోమ‌వారం ఐర్లాండ్‌తో భారత మ‌హిళ‌ల జ‌ట్టు త‌ల‌ప‌డింది.మొదట బ్యాంటింగ్ ఎంచుకున్న భార‌త్ 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు దీప్తి (160 బంతుల్లో 188; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), పూనమ్‌ (116 బంతుల్లో 109; 11 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 320 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


బ్యాంటింగ్‌కు దిగిన ఐర్లాండ్ భార‌త బౌల‌ర్ల ధాటిడిని నిలువ‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.ఐర్లాండ్‌ కెప్టెన్‌ లౌరా డిలనీ ఏడుగురు బౌలర్లను రంగంలోకి దింపినా భారత ఓపెనర్ల ధాటిని నిలువరించలేకపోయారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 40 ఓవర్లలో 109 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టంతా కలిసి పూనమ్‌ రౌత్‌ ఒక్కరే చేసిన స్కోరును చేయగలిగింది.
రికార్డుల ప‌రంగా చూస్తే వ‌న్డే క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర‌లో ఇదే అత్యుత్త‌మ‌మైన రికార్డు.పురుషుల వ‌న్డే క్రికెట్‌లో తొలివికెట్‌కు 286 ప‌రుగుల రికార్డు ఉంది.ఇది 2006 లో శ్రీలంక ఆట‌గాల్లు ఉప్ప‌ల్ త‌రంగ‌, జ‌య‌సూర్య‌లు ఈఘ‌న‌త సాధించారు.


Facebook

Videos