ఖ‌ర్చులు త‌గ్గించుకొనే ప‌నిలో బీసీసీఐ

BCCI officials may see hefty cut in foreign tour allowance

బీసీసీఐ త‌న ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొనేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇక నుంచివిదేశీ పర్యటనల్లో అధికారులు, కమిటీ చీఫ్‌లకు చెల్లించే డీఏ (రోజువారి భత్యం)ను బీసీసీఐ తగ్గించింది. గతంలో రోజుకూ 750 డాలర్లుగా ఉన్న డీఏను 500 డాలర్లకు పరిమితం చేసింది.

దీనిపై అన్ని రకాలుగా చర్చించిన బోర్డు ఇప్పటికే అమల్లోకి తెచ్చిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మామూలుగా విదేశీ టూర్లకు వెళ్లే అధికారులకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ రవాణ చార్జీలు, ఎయిర్ టిక్కెట్లు, హోటల్, ఫుడ్, ట్యాక్సీ బిల్లులు అన్నింటినీ బీసీసీఐనే చెల్లిస్తుంది. వీటికి అదనంగా మళ్లీ 750 డాలర్లు ఇస్తున్నారు. కానీ క్రికెటర్లకు మాత్రం కేవలం 125 డాలర్ల డీఏనే చెల్లిస్తుండటం విమర్శలకు దారితీసింది.దీంతో చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే అధికారులకు 500 పౌండ్లు, క్రికెటర్లకు 125 పౌండ్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.


అయితే బీసీసీఐ తీసుకొస్తున్న ఈవిధానాన్ని బోర్డులోని కొంద‌రు అధికారులు వ్య‌తిరేకిస్తున్నారు.మ్యాచ్ ఫీజుల కింద క్రికెటర్లు ఒక్కో టెస్టుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు తీసుకుంటున్నప్పుడు అధికారులకు ఆమాత్రం చెల్లిస్తే తప్పేలా అవుతుందని కొంత మంది అధికారులు వాదిస్తున్నారు.
క్రికెటర్లు 150 రోజులు పర్యటనల్లోనే ఉంటారు. అధికారులు అవసరాన్ని బట్టే వెళ్తారు. ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు, సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఉంటాయి. మాకు అవేమీ ఉండవు. ఇతర బోర్డు అధికారులు కలిసినప్పుడు వాళ్లకు మర్యాదపూర్వకంగా లంచ్, డిన్నర్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాల్సి వస్తుంద‌ని అధికారులు వాదిస్తున్నారు. వ్య‌క్తి స్థాయిని బట్టి డీఏ తగ్గించాలన్న ప్రతిపాదనను మేం వ్యతిరేకిస్తున్నా అధికారి తెలిపార‌.

Also Read

 


Facebook

Videos