టెస్ట్ ర్యాంకింగ్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన ఐసీసీ

Indian cricket team assured of No.1 Test ranking

అంత‌ర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్ ప‌లితాల‌ను ఐసీసీఐ ప్ర‌క‌టించింది. ప‌లితాల‌లో భార‌త్ అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకుంది.ఇండియా 123 పాయింట్లతో టీమిండియా తొలి స్థానంలో నిలవగా.. 117 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానం సంపాదించింది.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక ర్యాంకింగ్‌ పాయింట్‌ సాధించగా.. సఫారీలు ఏకంగా 109 నుంచి 117 పాయింట్లకు ఎగబాకింది. దీంతో గతంలో భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఉన్న 13 పాయింట్ల అంతరం ప్రస్తుతం ఆరుకు పడిపోయింది.దీంతో గతంలో భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఉన్న 13 పాయింట్ల అంతరం ప్రస్తుతం ఆరుకు పడిపోయింది.

భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తమ రేటింగ్‌ను మెరుగుపరచుకోగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ రేటింగ్స్‌లో కోతపడింది. ఆసీస్‌ మూడో ర్యాంకును నిలబెట్టుకున్నప్పటికీ 108 పాయింట్ల నుంచి 100కు పడిపోయింది. అదేవిధంగా ఇంగ్లాండ్‌ 101 నుంచి 99 పాయింట్లకు దిగజారి నాలుగులో నిలిచింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Also Read


Facebook

Videos