స‌చిన్ బ‌యేపిక్ ఆధారంగా త్వ‌ర‌లో విడుద‌ల అవుతున్న‌ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా

Sachin tendulkar meets the p.m

ఆటతీరుతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ గురించి ఆయన మోదీకి వివరించారు.ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాను’’ అని వెల్లడించాడు.


వారంలో రోజుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాల్యం నుంచి క్రికెట్ దిగ్గజంగా ఎదిగేవరకు.. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా ఈ నెల 26న ‘సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్’ విడుదల కానుంది.ఇందులో సచిన్ తన పాత్రలో తానే నటించడం విశేషం. సినిమాతో తన కెరీర్‌ గురించే కాకుండా అంజలితో ప్రణయ గాథ గురించి కూడా తెలుసుకుంటారని చెప్పిన విషయం తెలిసిందే. నా క్రీడా ప్రస్థానాన్ని మలచడంలో నా భార్య అంజలి కీలక పాత్ర పోషించింది’ అని సచిన్‌ అన్నాడు.


ఈ బయోపిక్‌ ద్వారా వ్యక్తిగత ఆలోచనలు, కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి కూడా పంచుకోవాలని అనుకుంటున్నానని సచిన్ తెలిపాడు. మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘సచిన్‌’ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే అభిమానులను విపరీతంగా అకట్టుకుంటోంది.అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాల రికార్డు నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ జీవితం గురించి తెలుసుకోవడానికి యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జేమ్స్‌ ఎర్క్‌సైన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్వర మాంత్రికుడు ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ సమకూర్చాడు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందాని ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.క్రికెట్‌తో అల‌రించిన‌ట్లుగానే సినిమాతో కూడా అభిమానుల‌ను అల‌రిస్తాడ‌నే టాక్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also read

  1. టెస్ట్ ర్యాంకింగ్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన ఐసీసీ
  2. రైజింగ్ పూణె చేతిలో చిత్త‌యిన ముంబై ఇండియ‌న్స్‌...
  3. ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భార‌త జ‌ట్టుకు స‌చిన సందేశం
  4. నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో దుమ్ము రేపిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు

Facebook

Videos